Share News

2030 నాటికి సెన్సెక్స్‌ 150000

ABN , Publish Date - Jun 05 , 2025 | 03:35 AM

వచ్చే ఐదేళ్లలో (2030 నాటికి) బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 1,50,000 పాయింట్లకు చేరుకోవచ్చని ప్రముఖ ఇన్వెస్టర్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌...

2030 నాటికి సెన్సెక్స్‌ 150000

వచ్చే ఐదేళ్లలో (2030 నాటికి) బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 1,50,000 పాయింట్లకు చేరుకోవచ్చని ప్రముఖ ఇన్వెస్టర్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అంచనా వేశారు. 2035 నాటికి సూచీ 3,00,000 పాయింట్లకు చేరుకోవచ్చని ఓ ఆంగ్ల మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. బలమైన దేశ ఆర్థిక మూలాలతోపాటు మార్కెట్‌ స్థితిస్థాపకత ఇందుకు దన్నుగా నిలవనున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘గత 45 ఏళ్ల చరిత్రను గమనిస్తే, మార్కెట్‌ 15 శాతం సంచిత వృద్ధితో (సీఏజీఆర్‌) పెరుగుతూ వచ్చింది. ఈ లెక్కన, ప్రస్తుతం 80,000 స్థాయిలో ఉన్న సెన్సెక్స్‌ వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల పాయింట్లకు ఎగబాకవచ్చు’’ అన్నారు.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 03:35 AM