Stock Market Trading: ఏడాది గరిష్ఠాల నుంచి కిందికి
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:05 AM
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహంతో పాటు ఐటీ, టెక్ షేర్లలో కొనుగోళ్లతో గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 స్థాయిల ఎగువన ట్రేడైనప్పటికీ, మళ్లీ కిందికి జారి స్వల్పలాభాలతో...
సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పైన ట్రేడింగ్ ప్రారంభం
ఆఖర్లో అమ్మకాల కారణంగా స్వల్ప లాభాల్లో ముగింపు
ముంబై: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహంతో పాటు ఐటీ, టెక్ షేర్లలో కొనుగోళ్లతో గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 స్థాయిల ఎగువన ట్రేడైనప్పటికీ, మళ్లీ కిందికి జారి స్వల్పలాభాలతో ముగింపు పలికాయి. ముహూరత్ ట్రేడింగ్ (మంగళవారం) ముగింపు స్థాయితో పోలిస్తే.. 727 పాయింట్ల లాభంతో 85,154 వద్ద ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 863.72 పాయింట్ల వరకు ఎగబాకి 85,290.06 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే, రష్యా ఇంధన దిగ్గజ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమై ఆ కంపెనీల నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీ్‌సతో పాటు ఇతర షేర్లలో పెద్దఎత్తున లాభాల స్వీకరణకు దిగారు. దాంతో సెన్సెక్స్ 130.06 పాయింట్ల లాభంతో 84,556.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 26,000 ఎగువన ట్రేడింగ్ ఆరంభించి, ఒక దశలో కొత్త ఏడాది గరిష్ఠ స్థాయి 26,104.20 వద్దకు చేరింది. ప్రాఫిట్ బుకింగ్‌తో మళ్లీ జారిన సూచీ కేవలం 22.80 పాయింట్ల లాభంతో 25,891.40 వద్ద ముగిసింది. సూచీలు లాభపడటం వరుసగా ఇది ఆరో రోజు.
ఇవీ చదవండి:
ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..
రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి