రెండో రోజూ అదే జోరు
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:50 AM
ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో పయనించాయి. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇందుకు...
సెన్సెక్స్ 444 పాయింట్లు అప్
ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో పయనించాయి. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇందుకు దోహదపడ్డాయి. గురువారం ఒక దశలో 913 పాయింట్ల వరకు ఎగబాకిన సెన్సెక్స్.. మదుపరుల లాభాల స్వీకరణ కారణంగా చివరికి 443.79 పాయింట్ల లాభంతో 81,442.04 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130.70 పాయింట్ల వృద్ధితో 24,750.90 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 18 రాణించాయి. ఎటర్నల్ స్టాక్ 4.50 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు పెరిగి రూ.85.79 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ ముడిచమురు పీపా ధర ఒక దశలో 0.35 శాతం పెరిగి 65.14 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,000 పెరుగుదలతో సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,04,100కు చేరింది. పది గ్రాముల మేలిమి బంగారం రూ.430 పెరుగుదలతో రూ.99,690 పలికింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఒక దశలో 3,393 డాలర్లు, సిల్వర్ 35.80 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్‌లో 1.6% వాటా విక్రయం: బజాజ్ ఫిన్‌సర్వ్‌లో 1.6 శాతం వాటాను ప్రమోటర్ కంపెనీలైన బజాజ్ హోల్డింగ్స్, జమన్‌లాల్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రయించనున్నట్లు తెలిసింది. శుక్రవారం బ్లాక్ డీల్స్ రూపంలో జరగనున్న ఈ విక్రయం ద్వారా ప్రమోటర్ కంపెనీలకు రూ.4,750 కోట్ల వరకు సమకూరవచ్చని అంచనా.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి