Stock Market: 80,000 దిగువకు సెన్సెక్స్
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:53 AM
అమెరికా సృష్టించిన సుంకాల కల్లోలంతో వరుసగా మూడో రోజు కూడా మార్కెట్ పతనమైంది. ఈక్విట ఫారెక్స్ మార్కెట్లు రెండూ పతనాల బాటలో..
ముంబై: అమెరికా సృష్టించిన సుంకాల కల్లోలంతో వరుసగా మూడో రోజు కూడా మార్కెట్ పతనమైంది. ఈక్విట ఫారెక్స్ మార్కెట్లు రెండూ పతనాల బాటలో పయనించగా బులియన్ మార్కెట్ మాత్రం దూసుకుపోయింది. దీంతో శుక్రవారం సెన్సెక్స్ 270.92 పాయింట్లు నష్టపోయి 79,809.65 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 338.81 పాయింట్ల నష్టంతో డే కనిష్ఠ స్థాయి 79,741.76ని తాకింది. కాగా నిఫ్టీ 74.05 పాయింట్ల నష్టంతో 24,426.85 వద్ద క్లోజైంది. వరుసగా 3 రోజుల పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.11,21,459.36 కోట్లు ఆవిరైపోయింది.
బంగారం దూకుడు: ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లకు భిన్నంగా బులియన్ మార్కె ట్లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. స్టాకిస్టులు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడంతో ఒక్క రోజులోనే 10గ్రాముల మేలిమి బంగారం (99.9% స్వచ్ఛత) ధర రూ.2,100 దూసుకుపోయి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,03,670ని తాకిందని అఖిల భారత సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఆభరణాల బంగారం (99.5 స్వచ్ఛత) కూ డా అదే స్థాయిలో పెరిగి రూ.1,03,100 పలికింది. బంగారం ధర పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. వారం మొత్తంలో బంగారం ధర రూ.3,300 (3.29%) పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..