Stock Market Today: మార్కెట్లో ఆద్యంతం ఊగిసలాటలే
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:44 AM
స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 338 పాయింట్లు ఎగబాకినప్పటికీ, క్రమంగా లాభాలను చేజార్చుకున్న సూచీ...
సెన్సెక్స్ 13 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 338 పాయింట్లు ఎగబాకినప్పటికీ, క్రమంగా లాభాలను చేజార్చుకున్న సూచీ చివరికి 13.53 పాయింట్ల నష్టంతో 82,186.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 29.80 పాయింట్లు కోల్పోయి 25,060.90 వద్ద స్థిరపడింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇందుకు కారణమైంది. క్విక్ కామర్స్ సంస్థ ఎటర్నల్, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ నష్టాలను పరిమితం చేశాయి. ఆగస్టు 1 నుంచి ట్రంప్ అదనపు సుంకాలు అమలులోకి రానున్న నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరకపోవడం, ఎఫ్‌ఐఐలు లాభాలు స్వీకరిస్తుండటం మన మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 17 నష్టపోగా.. టాటా మోటార్స్ షేరు అత్యధికంగా 2.04 శాతం క్షీణించింది. ఎటర్నల్ షేరు మాత్రం 10.56 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది.
ఇవీ చదవండి:
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి