సెన్సెక్స్ 31 పాయింట్లు డౌన్
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:21 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం ఆరంభ లాభాలను కోల్పోయి వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలతో పాటు...

ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం ఆరంభ లాభాలను కోల్పోయి వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలతో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం ఇందుకు కారణమైంది. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 751 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్.. చివరికి 32.11 పాయింట్ల నష్టంతో 76,138.97 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13.85 పాయింట్లు కోల్పోయి 23,031.40 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 16 రాణించగా.. 14 నష్టపోయాయి.