81 000 దిగువకు సెన్సెక్స్
ABN , Publish Date - Jun 04 , 2025 | 06:01 AM
విదేశీ నిధుల తరలింపు, పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ అస్థిరతల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా నష్టాలతో ముగిసింది. ఎనర్జీ, ఫైనాన్స్, ఐటీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకారానికి పాల్పడ్డారు...
మూడో రోజూ నష్టాల బాటలోనే..
ముంబై: విదేశీ నిధుల తరలింపు, పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ అస్థిరతల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా నష్టాలతో ముగిసింది. ఎనర్జీ, ఫైనాన్స్, ఐటీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకారానికి పాల్పడ్డారు. మంగళవారం రోజంతా ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ మరో 636.24 పాయింట్లు నష్టపోయి 80,737.51 వద్ద స్థిరపడగా నిఫ్టీ 174.10 పాయింట్ల నష్టంతో 24,542.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 798.66 పాయింట్ల మేరకు దిగజారి కనిష్ఠ స్థాయి 80,575.09ని తాకింది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 0.52ు, స్మాల్‌క్యాప్ సూచీ 0.07ు నష్టపోయాయి. కమోడిటీస్, రియల్టీ మినహా విభాగాల వారీ సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగతా 29 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి.
నష్టాల్లో అదానీ షేర్లు: అదానీ గ్రూప్‌పై మరోసారి ఆరోపణలు చెలరేగిన నేపథ్యంలో ఆ గ్రూప్ షేర్లు నష్టాల బాట పట్టాయి. అదానీ పోర్ట్స్ 2.42ు, ఎన్‌డీటీవీ 2.25ు, అదానీ ఎనర్జీ 2.18ు, అదానీ పవర్ 2.02ు నష్టపోయాయి. నష్టాలతో ముగిసిన ఇతర షేర్లలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ (1.89ు), అదానీ టోటల్ గ్యాస్ (1.62ు), అదానీ గ్రీన్ (.158ు), సంఘీ ఇండస్ట్రీస్ (1.16ు), అంబుజా సిమెంట్ (.088ు), ఏసీసీ (0.22ు), ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ (0.06ు) ఉన్నాయి.
6 ఐపీఓలకు సెబీ అనుమతి: హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా 6 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు జారీ చేయడానికి సెబీ అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి పొందిన ఇతర కంపెనీల్లో విక్రమ్ సోలార్, డోర్ఫ్-కెటాల్ కెమికల్స్, ఏ-వన్ స్టీల్స్ ఇండియా, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్, శ్రీజి షిప్పింగ్ గ్లోబల్ ఉన్నాయి. ఈ ఆరు కంపెనీలు కలిసి రూ.20,000 కోట్లు సమీకరించనున్నాయి.
అపోలో మైక్రోసిస్టమ్స్.. ప్రిఫరెన్షియల్ షేర్లు, వారంటీల జారీ ద్వారా రూ.416 కోట్లు సమీకరించినట్లు ప్రకటించింది. ప్రమోటర్ గ్రూప్, ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్య కుమార్ హల్వాసియాలకు వీటిని జారీ చేయటం ద్వారా ఈ మొత్తాలను సమీకరించినట్లు తెలిపింది.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి