సెన్సెక్స్ 239 పాయింట్లు డౌన్
ABN , Publish Date - May 29 , 2025 | 02:08 AM
ఈక్విటీ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. ఐటీసీ షేర్లు 3 శాతానికి పైగా క్షీణించడం ఇందుకు ప్రధాన కారణం. బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్ 239.31 పాయింట్లు కోల్పోయి...
ముంబై: ఈక్విటీ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. ఐటీసీ షేర్లు 3 శాతానికి పైగా క్షీణించడం ఇందుకు ప్రధాన కారణం. బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్ 239.31 పాయింట్లు కోల్పోయి 81,312.32 వద్దకు జారింది. నిఫ్టీ 73.75 పాయింట్ల నష్టంతో 24,752.45 వద్ద స్థిరపడింది. ఎఫ్ అండ్ ఓ నెలవారీ కాంట్రాక్టులు గురువారంతో ముగియనుండటంతోపాటు జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపరులు వేచిచూసే ధోరణిని ప్రదర్శించారని, దాంతో మార్కెట్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడాయని ఈక్విటీ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధాన సూచీలు నేలచూపులు చూసినప్పటికీ బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు మాత్రం 0.50 శాతం వరకు పెరిగాయి.
హీరో ఫిన్‌కార్ప్ ఐపీఓకు సెబీ ఆమోదం: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఆర్థిక సేవల అనుబంధ విభాగమైన హీరో ఫిన్‌కార్ప్ రూ.3,668 కోట్ల ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.2,100 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన రూ.1,568 కోట్ల ఈక్విటీ షేర్లను సైతం విక్రయించనుంది.
లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్‌ల నిర్వహణ సంస్థ స్ల్కోస్ బెంగళూరుతోపాటు ఏజిస్ వోపక్ టెర్మినల్స్ ఐపీఓలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు నాటికి స్ల్కోస్ బెంగళూరుకు ఇష్యూ సైజు కంటే 4.5 రెట్ల బిడ్లు రాగా.. ఏజిస్ వోపక్ ఇష్యూకు 2 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించింది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి