Share News

స్వల్ప లాభంతో సరి

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:25 AM

మార్కెట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు ప్రామాణిక సూచీలను మంగళవారం లాభాల్లో నడిపించాయి. ఒక దశలో 267.83 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌..

స్వల్ప లాభంతో సరి

90 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: మార్కెట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు ప్రామాణిక సూచీలను మంగళవారం లాభాల్లో నడిపించాయి. ఒక దశలో 267.83 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌.. చివరికి 90.83 పాయింట్ల స్వల్పలాభంతో 83,697.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.75 పాయింట్లు పెరిగి 25,541.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 13 లాభపడగా.. మిగతా 17 నష్టపోయాయి. భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ షేరు 2.51 శాతం ఎగిసి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలవగా.. రిలయన్స్‌ స్టాక్‌ 1.84 శాతం పెరిగింది. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం 0.18 శాతం వరకు నష్టపోయాయి.

సిగాచీ షేరు మరో 6 శాతం పతనం: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ సిగాచీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేరు వరుసగా రెండో రోజూ భారీ పతనాన్ని చవిచూసింది. బీఎ్‌సఈలో కంపెనీ షేరు మరో 6 శాతం మేర క్షీణించి రూ.46.07 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి

కొన్ని నెలల్లో ఇరాన్‌ అణు కార్యక్రమం మళ్లీ మొదలు

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అకృత్యం

Updated Date - Jul 02 , 2025 | 04:25 AM