SEBI Proposes KYC Mandate for Mutual Fund: కేవైసీ పూర్తి చేస్తేనే మ్యూచువల్ ఫండ్స్
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:56 AM
మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎ్‌ఫ)కు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కొత్త ప్రామాణికాలు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. నో యువర్ క్లయింట్ (కేవైసీ) పూర్తి చేసిన మదుపరులను మాత్రమే ఇక నుంచి మ్యూచువల్ ఫండ్స్...
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎ్‌ఫ)కు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కొత్త ప్రామాణికాలు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. నో యువర్ క్లయింట్ (కేవైసీ) పూర్తి చేసిన మదుపరులను మాత్రమే ఇక నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థల్లో తొలి ఫోలియో (ఖాతా) ప్రారంభానికి అనుమతించాలని ప్రతిపాదించింది. చాలా మంది మదుపరులు కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల (కేఆర్‌ఏ) వద్ద కేవైసీ పూర్తి చేయకుండానే ఎంఎఫ్ పథకాల్లో మదుపు చేస్తున్నట్టు ఇటీవల ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో సెబీ ఈ ప్రతిపాదన తీసుకువచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీ) తమకు అందిన మదుపరుల సబ్‌స్ర్కిప్షన్ వివరాలను కేఆర్‌ఏలకు పంపించి నిర్ణయం తీసుకుంటాయి.
ఎన్‌ఆర్‌ఐలకూ ఊరట: ఎన్‌ఆర్‌ఐ మదుపరులకు జియో ట్యాగింగ్ విధానాన్నీ సులభతరం చేయాలని సెబీ ప్రతిపాదించింది. వీడియో క్లయింట్ ఐడెంటిఫికేషన్ (వీ-సీఐపీ) లేదా డిజిటల్ ఆన్‌బోర్డింగ్ పద్దతిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఎన్‌ఆర్‌ఐలు కేవైసీ చేసేటప్పుడు భౌతికంగా దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు.
ఇవీ చదవండి:
ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..
రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి