దీర్ఘకాలిక పెట్టుబడులకు మన మార్కెట్ భేష్
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:39 AM
అంతర్జాతీయంగా కొన్ని ఆటుపోట్లు ఉన్నా భారత స్టాక్ మార్కెట్ బాగానే ఉందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు..
సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే
ముంబై: అంతర్జాతీయంగా కొన్ని ఆటుపోట్లు ఉన్నా భారత స్టాక్ మార్కెట్ బాగానే ఉందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. ట్రంప్ సుంకాలతో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ ఇప్పటికే ఆ నష్టాల నుంచి పూర్తిగా బయట పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన ఆర్థిక పునాదులు బలంగా ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రిటైల్ మదుపరులు దీర్ఘకాలిక లాభాల కోసం దేశీయ స్టాక్ మార్కెట్లో పూర్తి భరోసాతో పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. అయితే నష్టభయం ఎక్కువగా ఉండే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌కు మాత్రం రిటైల్ మదుపరులు దూరంగా ఉండాలని కోరారు. తీవ్ర స్పెక్యులేషన్‌తో కూడిన ఎఫ్ అండ్ ఓలో మదుపు చేయడం అంటే జూదం ఆడడం తప్ప మరోటి కాదన్నారు. అలాగే చెప్పుడు మాటలు విని కూడా మార్కెట్లో పెట్టుబడులు పెట్టవద్దన్నారు. పూర్తి అవగాహన, సమాచారం, తెలివితోనే రిటైల్ మదుపరులు షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరపాలని పాండే సూచించారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News