మార్కెట్లో మోసాలను అడ్డుకునే సత్తా మాకుంది
ABN , Publish Date - May 02 , 2025 | 02:38 AM
స్టాక్ మార్కెట్లో జరిగే మోసాలు, కుట్రలను అడ్డుకునే సత్తా తమకు ఉందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు...
సెబీ చైర్మన్ పాండే
ముంబై: స్టాక్ మార్కెట్లో జరిగే మోసాలు, కుట్రలను అడ్డుకునే సత్తా తమకు ఉందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. మోసగాళ్ల ఆటకట్టించేందుకు ఇప్పటికే అవసరమైన నియంత్రణలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా ఈ నియంత్రణలు పనిచేయడం లేదనే అభిప్రాయంతో ఉంటే, వారు వెంటనే ఆ అభిప్రాయం నుంచి బయటికి రావాలని పాండే కోరారు.
ఇవి కూడా చదవండి
Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..
Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు