హైదరాబాద్‌లో ఎస్‌బీఐ గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:06 AM
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) 70వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలపై దృష్టి పెట్టింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) 70వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నాడు హైదరాబాద్ సహా కోల్‌కతాలో రెండు గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్స్ (జీటీఎ్‌ఫసీ)ను ప్రారంభించింది. ఈ కేంద్రాల ద్వారా ఎగుమతి, దిగుమతిదారులకు త్వరితగతిన అవసరమైన అందించనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. అంతర్జాతీయ బ్యాంకింగ్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అంతర్జాతీయ వాణిజ్యం రోజురోజుకి డిజిటలైజ్ అవుతోంది. దీంతో మారుతున్న జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా బ్యాంక్ ఫైనాన్స్ సామర్థ్యాలను పునర్ వ్యవస్థీకరించాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ రెండు కేంద్రాల ద్వారా ఆ లక్ష్యం నెరవేరుతుందని శెట్టి తెలిపారు.
సెప్టెంబరు నుంచి మెరుగైన లాభాలు: ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుతో ప్రస్తుతం బ్యాంకుల లాభాలపై ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి చెప్పారు. అయితే సెప్టెంబరు తర్వాత బ్యాంకుల లాభాలు మళ్లీ గాడిలో పడతాయని ఆశిస్తున్నట్టు ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని 4 నుంచి 3 శాతానికి కుదిస్తూ ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో సెప్టెంబరు నుంచి తమ నిధుల సమీకరణ ఖర్చులూ తగ్గుతాయన్నారు.
ఇవీ చదవండి:
మీ వ్యక్తిగత రుణాన్ని ఈ 5 మార్గాలతో ఈజీగా తీర్చుకోండి
వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. డేంజర్ జాగ్రత్త..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి