సౌదీ అరేబియా అప్పుల వేట
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:11 AM
సౌదీ అరేబియా ఆర్థిక కష్టాల్లో ఉందా? పరిస్థితులను గమనిస్తే అలాగే అనిపిస్తోంది. పెట్రో డాలర్లతో తులతూగుతున్న ఈ దేశం కూడా ఇప్పుడు అప్పుల వేటలో పడింది. ఇందులో భాగంగా సోమవారం...
రియాద్: సౌదీ అరేబియా ఆర్థిక కష్టాల్లో ఉందా? పరిస్థితులను గమనిస్తే అలాగే అనిపిస్తోంది. పెట్రో డాలర్లతో తులతూగుతున్న ఈ దేశం కూడా ఇప్పుడు అప్పుల వేటలో పడింది. ఇందులో భాగంగా సోమవారం రుణ పత్రాల ద్వారా 700 కోట్ల డాలర్లు (సుమారు రూ.60,000 కోట్లు) సమీకరించింది. బడ్జెట్ లోటు పూడ్చుకోవడంతో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ రుణ పత్రాలు జారీ చేస్తోంది. గత ఏడాది కూడా రుణ పత్రాల జారీ ద్వారా సౌదీ ప్రభుత్వం 2,500 కోట్ల డాలర్లు సమీకరించింది. ఈ సంవత్సరం ఇది 3,700 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.17 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అంచనా. బ్యారల్ ముడి చమురు ధర తన అంచనా అయిన 90 డాలర్లకు దిగువకి పడిపోవడంతో సౌదీ అరేబియా కూడా నిధుల కొరత ఎదుర్కొంటోంది. దీంతో అప్పుల వేటలో పడింది.