Share News

బీ న్యూలో సంక్రాంతి ఆఫర్లు

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:56 AM

మొబైల్స్‌ రిటైల్‌ సంస్థ బీ న్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌.. సంక్రాంతి సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్‌తో పాటు గృహోపకరణాలపై కూడా ఆఫర్లు అందుబాటులో...

బీ న్యూలో సంక్రాంతి ఆఫర్లు

హైదరాబాద్‌: మొబైల్స్‌ రిటైల్‌ సంస్థ బీ న్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌.. సంక్రాంతి సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్‌తో పాటు గృహోపకరణాలపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సంస్థ సీఈఓ వై సాయి నిఖిలేష్‌ తెలిపారు. ల్యాప్‌టాప్‌, టీవీలపై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్‌ సహా ఎంపిక చేసిన మొబైల్స్‌పై 50 శాతం వరకు, యాక్సెసరీ్‌సపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్లు నిఖిలేష్‌ తెలిపారు. ఐఫోన్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్‌తో పాటు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని తెలిపారు. జీరో డౌన్‌ పేమెంట్‌, నో కాస్ట్‌ ఈఎంఐ విధానంలో స్మార్ట్‌ఫోన్‌ను తమ షోరూమ్స్‌లో కొనుగోలు చేయవచ్చన్నారు.


సంక్రాంతి ప్రత్యేక ఆఫర్‌ కింద ప్రతి కొనుగోలుపై ఒక ఈఎంఐ ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని 150కి పైగా ఉన్న బీ న్యూ షోరూమ్స్‌లో సంక్రాంతి ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి తెలిపారు.

Updated Date - Jan 10 , 2025 | 03:56 AM