Share News

రూ.9,499కే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:41 AM

కొరియా ఎలక్ర్టానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ రూ.10,000 లోపు ధర గల స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి ప్రవేశించింది. దేశీయ మార్కెట్లో గెలాక్సీ ఎఫ్‌06 హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. అలా ఇటీవల ఈ సెగ్మెంట్‌లో...

రూ.9,499కే  సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌

మార్కెట్లోకి గెలాక్సీ ఎఫ్‌06 హ్యాండ్‌సెట్‌

న్యూఢిల్లీ: కొరియా ఎలక్ర్టానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ రూ.10,000 లోపు ధర గల స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి ప్రవేశించింది. దేశీయ మార్కెట్లో గెలాక్సీ ఎఫ్‌06 హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. అలా ఇటీవల ఈ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు జారీ చేసిన కంపెనీల సరసన చేరింది. స్టైలి్‌షగా కనిపించే ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియెంట్లలో అందుబాటులో ఉంటుంది. 4జీబీ సిస్టమ్‌ మెమొరీ, 128 జీబీ స్టోరేజీ గల వెర్షన్‌ ధర రూ.9,499 కాగా 6జీబీ సిస్టమ్‌ మెమరీ, 128 జీబీ స్టోరేజీ గల వెర్షన్‌ ధర రూ.10,999. మీడియాటెక్‌ డీ6300 ప్రాసెసర్‌తో కూడిన ఈ హ్యాండ్‌సెట్‌ను 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో తీసుకు వచ్చి నట్లు సామ్‌సంగ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ అక్షయ్‌ రావు అన్నారు.


For Business News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:41 AM