Share News

ఎన్‌కేఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సంపత్‌ కుమార్‌

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:07 AM

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ సంస్థ నిప్పన్‌ కోయి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎన్‌కేఐ)...

ఎన్‌కేఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సంపత్‌ కుమార్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ సంస్థ నిప్పన్‌ కోయి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎన్‌కేఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జీ సంపత్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఈ కంపెనీకి ఎండీగా ఒక భారతీయుడు నియమితుడు కావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కత్సుయా ఫుకసకు కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. ఐఐటీ బీహెచ్‌యూ పూర్వ విద్యార్థి అయిన సంపత్‌ కుమార్‌కు సివిల్‌ ఇంజనీరింగ్‌, ఐటి కన్సల్టెన్సీలో 35 సంవత్సరాల అనుభవం ఉంది.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 05:07 AM