Sagar Cements Reports: తగ్గిన సాగర్ సిమెంట్స్ నష్టాలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:42 AM
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సాగర్ సిమెంట్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.44 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.57 కోట్లుగా ఉంది. నిర్వహణపరంగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సాగర్ సిమెంట్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.44 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.57 కోట్లుగా ఉంది. నిర్వహణపరంగా వ్యయాలు పెరిగిపోవటం పనితీరును దెబ్బతీసిందని కంపెనీ పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 27 శాతం వృద్ధితో రూ.475 కోట్ల నుంచి రూ.602 కోట్లకు పెరిగింది. అమ్మకాలపరంగా మంచి పనితీరు కనిపించినప్పటికీ రుతుపవనాల ప్రభా వం కొంత మేరకు పడిందని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నిర్వహణాపరంగా సామర్థ్యాలను పెంచుకోవటంపై దృష్టి పెట్టడం సహా వ్యయ నియంత్రణలను పాటించటం కలిసివచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఇన్‌ఫ్రా, హౌసింగ్, నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నామని, దీంతో డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాలు 60 లక్షల టన్నులుగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి:
ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..
రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి