Share News

2025లో రూ.1.64 లక్షల కోట్లు

ABN , Publish Date - Feb 12 , 2025 | 03:24 AM

ఈ ఏడాది భారత మీడియా విభాగాల ప్రకటనల ఆదాయ వృద్ధి 7 శాతానికి తగ్గవచ్చని ప్రముఖ మీడియా ఏజెన్సీ గ్రూప్‌ఎం అంచనా వేసింది. 2024లో ఈ వృద్ధి 8.8 శాతంగా నమోదైందని రిపోర్టులో పేర్కొంది...

2025లో రూ.1.64 లక్షల కోట్లు

  • ప్రకటనల ఆదాయంపై గ్రూప్‌ఎం నివేదిక

ముంబై: ఈ ఏడాది భారత మీడియా విభాగాల ప్రకటనల ఆదాయ వృద్ధి 7 శాతానికి తగ్గవచ్చని ప్రముఖ మీడియా ఏజెన్సీ గ్రూప్‌ఎం అంచనా వేసింది. 2024లో ఈ వృద్ధి 8.8 శాతంగా నమోదైందని రిపోర్టులో పేర్కొంది. 2025లో దేశంలోని అన్ని మీడియా విభాగాలకు ప్రకటనల ద్వారా మొత్తం రూ.1,64,137 కోట్ల ఆదాయం సమకూరవచ్చని గ్రూప్‌ఎం అంటోంది. 2024లో నమోదైన రూ.1,53,407 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 7 శాతం అధికం. నివేదికలోని మరిన్ని విషయాలు..

  • ప్రపంచంలోని అతిపెద్ద అడ్వర్టైజ్‌మెంట్‌ మార్కెట్లలో భారత్‌ 9వ స్థానంలో ఉండగా.. అమెరికా, చైనా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) టాప్‌-3 స్థానాల్లో ఉన్నాయి.

  • ప్రపంచవ్యాప్తంగా యాడ్‌ రెవెన్యూ వృద్ధి ఈ ఏడాదిలో 7.7 శాతానికి పరిమితం కానుంది. 2024లో ఇది 9.5 శాతంగా నమోదైంది.


  • భారత్‌లో డిజిటల్‌ ప్రకటనల ఆదాయం వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది డిజిటల్‌ యాడ్‌ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 11.5ు వృద్ధితో రూ.లక్ష కోట్లకు చేరుకోవచ్చని అంచనా.

  • దేశంలో మొత్తం ప్రకటనల ఖర్చులో 60 శాతం వాటా డిజిటల్‌ యాడ్స్‌దే. ప్రపంచవ్యాప్తంగా ఈ వాటా 82 శాతంగా ఉంది.

  • టీవీ ప్రకటనల ఆదాయం ఈ ఏడాదిలో 1ు తగ్గి రూ.42,431 కోట్లకు పరిమితం కావచ్చని అంచనా. 2024లో ఈవిభాగ ప్రకటనల రెవె న్యూ రూ.42,859 కోట్లుగా నమోదైంది. టీవీ యా డ్‌ రెవెన్యూలో 12.6ువాటా స్ర్టీమింగ్‌ టీవీలదే.

  • 2025లో పత్రికల ప్రకటనల ఆదాయం 4 శాతం పెరిగి రూ.15,947 కోట్లుగా నమోదుకావచ్చని అంచనా. మొత్తం ప్రకటనల ఆదాయంలో ఈ విభాగ వాటా 10 శాతంగా ఉండనుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 03:24 AM