Share News

రూ.11. 65 లక్షల కోట్లు.. రెమిటెన్స్‌ల్లో సరికొత్త రికార్డు

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:09 AM

గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రవాస భారతీయులు స్వదేశానికి రికార్డు స్థాయిలో 13,546 కోట్ల డాలర్ల (దాదాపు రూ.11.65 లక్షల కోట్లు) నిధులు పంపారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం..

రూ.11. 65 లక్షల కోట్లు..   రెమిటెన్స్‌ల్లో సరికొత్త రికార్డు

గత ఆర్థిక సంవత్సరం రెమిటెన్స్‌ల్లో సరికొత్త రికార్డు

8 ఏళ్లలో రెట్టింపైన నిధులు

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రవాస భారతీయులు స్వదేశానికి రికార్డు స్థాయిలో 13,546 కోట్ల డాలర్ల (దాదాపు రూ.11.65 లక్షల కోట్లు) నిధులు పంపారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే, దేశంలోకి రెమిటెన్స్‌లు 14 శాతం పెరిగాయి. 8 ఏళ్ల క్రితం (2016-17 ఆర్థిక సంవత్సరం) వచ్చిన 6,100 కోట్ల డాలర్ల (రూ.5.25 లక్షల కోట్లు) రెమిటెన్స్‌లతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగాయి. మరిన్ని విషయాలు..

  • ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్‌లు అందుకున్న దేశాల్లో భారత్‌ మరోసారి తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఈ విషయంలో భారత్‌ పదేళ్లకు పైగా కాలంగా నం.1 స్థానంలో ఉంది.

  • గత ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల డాలర్లుగా నమోదైన కరెంట్‌ ఖాతా నిధుల రాకలో 10 శాతానికి పైగా వాటా రెమిటెన్స్‌లదే.

  • ఆర్‌బీఐ రీసెర్చ్‌ ప్రకారం.. మొత్తం రెమిటెన్స్‌లో 45 శాతం అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తున్నాయి. గతంలో అధిక రెమిటెన్స్‌లు సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌ వంటి గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చేవి. గడిచిన కొన్నేళ్లలో గల్ఫ్‌ దేశాల వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది. భారత వృత్తి నిపుణులు అభివృద్ధి చెందిన దేశాలకు వలస పోతుండటం ఇందుకు కారణం.

  • రెమిటెన్స్‌లు మన వాణిజ్య లోటును తగ్గించడంలో, ఆర్థిక వ్యవస్థ బలోపేతంలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. 2024-25లో మన వాణిజ్య లోటు 28,700 కోట్ల డాలర్లు. ఈ లోటులో 47 శాతం వరకు రెమిటెన్స్‌లతో పూడ్చుకోవచ్చన్నమాట.

ఇవీ చదవండి:

మీ వ్యక్తిగత రుణాన్ని ఈ 5 మార్గాలతో ఈజీగా తీర్చుకోండి

వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. డేంజర్ జాగ్రత్త..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 06:04 AM