ఎంఎ్‌సఎంఈ ఫార్మా యూనిట్లకు ఊరట
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:28 AM
చిన్న, మధ్యతరహా ఫార్మా కంపెనీలకు (ఎంఎ్‌సఎంఈ) ప్రభుత్వం పెద్ద ఊరట ఇచ్చింది. ఈ కంపెనీలు ఉత్తమ తయారీ విధానాలకు (జీఎంపీ) మారాల్సిన గడువును 2026 జనవరి 1 వరకు పొడిగించింది...

జీఎంపీ ప్రమాణాలకు మరో ఏడాది
న్యూఢిల్లీ: చిన్న, మధ్యతరహా ఫార్మా కంపెనీలకు (ఎంఎ్‌సఎంఈ) ప్రభుత్వం పెద్ద ఊరట ఇచ్చింది. ఈ కంపెనీలు ఉత్తమ తయారీ విధానాలకు (జీఎంపీ) మారాల్సిన గడువును 2026 జనవరి 1 వరకు పొడిగించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కంపెనీలు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలన్నా, ప్ర పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నిర్వహణలోని కార్యక్రమాలకు ఔషధాలు సరఫరా చేయాలన్నా జీఎంపీ సర్టిఫికేషన్ తప్పనిసరి. ప్రస్తుతం దేశంలో 10,500 ఫార్మా కంపెనీలుంటే అందులో 8,500 ఎంఎస్‌ఎంఈలు. ఇందులో 2,000 ఎంఎ్‌సఎంఈలకు మాత్రమే జీఎంపీ సర్టిఫికేషన్ ఉంది.