అచేతన ఖాతాల సెటిల్‌మెంట్ నిబంధనల సడలింపు : సెబీ
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:20 AM
30 రోజుల పాటు అచేతనంగా ఉన్న ట్రేడింగ్ ఖాతాల్లోని క్లయింట్ల నిధుల సెటిల్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సడలించింది...

అచేతన ఖాతాల సెటిల్‌మెంట్ నిబంధనల సడలింపు : సెబీ
30 రోజుల పాటు అచేతనంగా ఉన్న ట్రేడింగ్ ఖాతాల్లోని క్లయింట్ల నిధుల సెటిల్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సడలించింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను రక్షించే ఉద్దేశంతో సరళీకరించిన నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని సెబీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు అమలైన నిబంధనల ప్రకారం.. స్టాక్ బ్రోకర్లు అచేతన ఖాతాలను రోజువారీగా గుర్తించి, వాటిలోని నిధులను క్లయింట్లకు 3 పనిదినాల్లో బదలాయించాల్సి వచ్చేది. ఇకపై స్టాక్ బ్రోకర్లు ఎక్స్ఛేంజీలు తమ వార్షిక క్యాలెండర్‌లో నోటిఫై చేసిన నెలవారీ రన్నింగ్ అకౌంట్ సెటిల్‌మెంట్ సైకిల్ ప్రకారంగా అచేతన ఖాతాల్లోని సొమ్మును పరిష్కరించాల్సి ఉంటుంది.