Share News

వడ్డీ రేట్లను వెంటనే తగ్గించండి

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:21 AM

తగ్గిన రెపో రేటుకు అనుగుణంగా బ్యాంకులన్నీ తమ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కోరింది. ఈ నెల 6న జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ...

వడ్డీ రేట్లను వెంటనే తగ్గించండి

  • జాప్యం చేయొద్దు

  • బ్యాంకులకు ఆర్‌బీఐ సూచన

ముంబై: తగ్గిన రెపో రేటుకు అనుగుణంగా బ్యాంకులన్నీ తమ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కోరింది. ఈ నెల 6న జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ కీలక రెపో రేటును ఆరు శాతం నుంచి 5.5 శాతానికి కుదించింది. ఈ నేపథ్యంలో తగ్గించిన రెపో రేటు స్థాయిలోనే బ్యాంకులు వెంటనే తమ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లు తగ్గించాలని గురువారం వెలువడిన జూన్‌ నెల ఆర్‌బీఐ బులెటిన్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఆర్థికవేత్తలు సూచించించారు. బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద హామీగా ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)నీ ఆర్‌బీఐ ఈ నెల 6న నాలుగు నుంచి మూడు శాతానికి కుదించింది. దీంతో ఈ ఏడాది చివరికల్లా బ్యాంకులకు రూ.2.5 లక్షల కోట్ల నిధులు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గించేందుకు అనువైన పరిస్థితులేనేని ఆ బులెటిన్‌ పేర్కొంది.

పరోక్ష మొట్టికాయ: రెపో రేటు తగ్గించిన కొద్ది రోజులకే ఎస్‌బీఐ, బీఓబీ, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌తో పాటు అనేక బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్లను అర శాతం (0.5ు) తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఇంకా కొన్ని బ్యాంకులు ఈ తగ్గింపును తమ రుణ ఖాతాదారులకు బదిలీ చేసేందుకు మీనమేషాలు లెక్కబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా బులెటిన్‌ ఆ బ్యాంకులను సుతిమెత్తగా హెచ్చరించిందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే.. పూర్తి చేశారా లేదా..

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 27 , 2025 | 05:21 AM