RBI : కస్టమర్లకు కాల్ చేసేందుకు ‘1600XX’ సిరీస్‌నే ఉపయోగించండి
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:20 AM
బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న ఆర్థిక మోసాలను నిరోధించేందుకు ఆర్‌బీఐ మరో నిర్ణయం తీసుకుంది. వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎ్‌సల ద్వారా జరుగుతున్న ఆర్థిక

బ్యాంకులను కోరిన ఆర్‌బీఐ
ముంబై: బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న ఆర్థిక మోసాలను నిరోధించేందుకు ఆర్‌బీఐ మరో నిర్ణయం తీసుకుంది. వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎ్‌సల ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు లావాదేవీల విషయమై ఖాతాదారులకు కాల్ చేసేందుకు ‘1600XX’ సిరీస్ నంబర్లను మాత్రమే ఉపయోగించాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరింది. అలాగే, ప్రచార అవసరాల కోసం ‘140XX’ సిరీస్ నంబర్లను మాత్రమే వినియోగించాలని నిర్దేశించింది. అంతేకాదు, బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు తమ కస్టమర్ల డేటాబే్‌సను పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తుండాలని సూచించింది. మార్చి31 నాటికి ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
అకౌంట్లు, లాకర్లకు నామినీలుండాల్సిందే: మరణించిన ఖాతాదారు కుటుంబ సభ్యులు లేదా సంబంధీకులకు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను వేగవంతం చేసేందుకు అన్ని ఖాతాలు, లాకర్లకు నామినీ వివరాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. ప్రస్తుత, కొత్త డిపాజిట్ అకౌంట్లు, సేఫ్టీ లాకర్లకు నామినీలను నిర్ధారించాలని కోరింది.