డిజిటల్ బ్యాంకింగ్ చానల్స్ మరింత కట్టుదిట్టం ఆర్‌బీఐ
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:52 AM
RBI Strengthens Digital Banking Channel Rules
ముంబై: బ్యాంకుల డిజిటల్ బ్యాంకింగ్ చానల్స్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరింత పటిష్ఠం చేసింది. ఈ చానల్స్‌తో బ్యాంకులు మరో సంస్థకు చెందిన ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించడాన్ని నిషేధించింది. బ్యాంకుల అనుబంద సంస్థలు, జాయింట్ వెంచర్ (జేవీ) కంపెనీలకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి ‘ఆర్‌బీఐ (డిజిటల్ బ్యాంకింగ్ చానల్స్ అథరైజేషన్) డైరెక్షన్స్, 2025 పేరుతో సోమవారం కొన్ని ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై వచ్చే నెల 11లోగా బ్యాంకులు, సంబంధిత పార్టీలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. ప్రతి బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం రిస్క్ ఆధారిత లావాదేవీల పర్యవేక్షణ, నిఘా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆర్‌బీఐ కోరింది.
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి