వరుసగా మూడోసారి వడ్డీ రేట్ల కోత
ABN , Publish Date - Jun 02 , 2025 | 02:47 AM
దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో వృద్ధికి ఊతం ఇచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఈ వారంలో మరోసారి రేట్ల కోత ప్రకటించే ఆస్కారం ఉందని విశ్లేషకులు...
4 నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ భేటి
ముంబై: దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో వృద్ధికి ఊతం ఇచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఈ వారంలో మరోసారి రేట్ల కోత ప్రకటించే ఆస్కారం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే వరుసగా మూడోసారి ఆర్‌బీఐ కీలక రెపో రేటును తగ్గించినట్టవుతుంది. ప్రపంచంలో నెలకొన్న అస్థిరతల నేపథ్యంలో ఈసారి కూడా వృద్ధికి ఊతం ఇచ్చేందుకే ఆర్‌బీఐ మొగ్గు చూపవచ్చని వారి అభిప్రాయం. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం వచ్చే బుధవారం (4వ తేదీ) నుంచి శుక్రవారం (6వ తేదీ) వరకు జరగనుంది. శుక్రవారం ఉదయం ఎంపీసీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రకటిస్తారు. ఆర్‌బీఐ ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో జరిగిన సమావేశాల్లో 2 విడతలుగా 0.50ు మేరకు రెపో రేటును తగ్గించడంతో ప్రస్తుతం అది 6ు వద్ద ఉంది.
ఇవీ చదవండి:
జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి