Share News

LIC Chief: ఎల్‌ఐసీ చీఫ్‌గా దొరైస్వామి

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:27 AM

ప్రభుత్వ రంగంలోని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) కొత్త సారథిగా ఆర్‌ దొరైస్వామి నియమితులయ్యారు. మూడు సంవత్సరాల కాలానికి...

LIC Chief: ఎల్‌ఐసీ చీఫ్‌గా దొరైస్వామి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) కొత్త సారథిగా ఆర్‌ దొరైస్వామి నియమితులయ్యారు. మూడు సంవత్సరాల కాలానికి ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా ఆయనను నియమిస్తూ ఆర్థిక సర్వీసుల శాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2028 ఆగస్టు 28 వరకు అంటే 62 సంవత్సరాల వయసు వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఎల్‌ఐసీలో ఎండీ, సీఈఓతో పాటు నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లుంటారు.

01-00Business.jpg

ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.444.79 కోట్ల డివిడెండ్‌ను అందించింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు యూకో బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశ్వనీ కుమార్‌ ఈ డివిడెండ్‌ చెక్‌ను అందజేశారు.

ఇవి కూడా చదవండి

నీ వయస్సు అయిపోయింది.. అందుకే..

ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 05:33 AM