Share News

PVR INOX: వచ్చే రెండేళ్లలోరూ.75 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jul 05 , 2025 | 02:59 AM

వచ్చే రెండేళ్లలో తెలంగాణలో రూ.75 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పీవీఆర్‌ ఐనాక్స్‌ ప్రకటించింది.

PVR INOX: వచ్చే రెండేళ్లలోరూ.75 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వచ్చే రెండేళ్లలో తెలంగాణలో రూ.75 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పీవీఆర్‌ ఐనాక్స్‌ ప్రకటించింది. శుక్రవారం నాడిక్కడ హఫీజ్‌ఫేట్‌లో సరికొత్త 4 స్ర్కీన్స్‌ మల్టీప్లెక్స్‌ ధియేటర్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ సీఓఓ రోహన్‌ సాబ్లే మాట్లాడుతూ.. కార్యకలాపాల విస్తరణలో భాగంగా రానున్న రెండేళ్లలో ప్రతిపాదిత పెట్టుబడులతో మరో ఐదు మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


ఈ మల్టీప్లెక్స్‌తో 20 కొత్త స్ర్కీన్స్‌ అందుబాటులోకి రానున్నాయన్నారు. అంతేకాకుండా కొత్తగా 400 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దీంతో తెలంగాణలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,700కు చేరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం దక్షిణాది రీజియన్‌లో పీవీఆర్‌ ఐనాక్స్‌ 565 స్ర్కీన్స్‌ను నిర్వహిస్తుండగా అందులో 106 స్ర్కీన్స్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 02:59 AM