Share News

Public Sector Banks: పీఎస్‌బీల లాభాల్లో సరికొత్త రికార్డు

ABN , Publish Date - Aug 09 , 2025 | 03:11 AM

జూన్‌ త్రైమాసికంలో ఎస్‌బీఐ సహా దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొత్తం లాభాలు సరికొత్త రికార్డు

Public Sector Banks: పీఎస్‌బీల లాభాల్లో సరికొత్త రికార్డు

జూన్‌ త్రైమాసికంలో ఎస్‌బీఐ సహా దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొత్తం లాభాలు సరికొత్త రికార్డు స్థాయి రూ.44,218 కోట్లకు పెరిగాయి. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో ఈ బ్యాంక్‌లు ఆర్జించిన రూ.39,974 కోట్లతో పోలిస్తే ఇది 11ు (రూ.4,244 కోట్లు) అధికం. పీఎ్‌సబీల జూన్‌ త్రైమాసిక లాభాల్లో ఎస్‌బీఐ వాటాయే 43 శాతం. కాగా, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) నికర లాభం వార్షిక ప్రాతిపదికన 76% వృద్ధి చెంది రూ.1,111 కోట్లుగా నమోదైంది. లాభాల్లో అత్యధిక వృద్ధి నమోదు చేసిన బ్యాంక్‌ ఇదే. 12 పీఎ్‌సబీల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) లాభంలో మాత్రం 48% తగ్గుదల నమోదైంది.

Updated Date - Aug 09 , 2025 | 03:11 AM