Share News

కాకినాడ యూనిట్‌-3లో ఉత్పత్తి షురూ: దివీస్‌

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:13 AM

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ సమీపంలోని ఒంటిమామిడి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన యూనిట్‌-3లో ఉత్పత్తి ప్రారంభించినట్లు దివీస్‌ లేబొరేటరీస్‌ ప్రకటించింది...

కాకినాడ యూనిట్‌-3లో ఉత్పత్తి షురూ: దివీస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ సమీపంలోని ఒంటిమామిడి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన యూనిట్‌-3లో ఉత్పత్తి ప్రారంభించినట్లు దివీస్‌ లేబొరేటరీస్‌ ప్రకటించింది. ఈ నెల 1న ఈ ప్రాజెక్టులో తొలి దశ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినట్టు తెలిపింది. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) ఉత్పత్తి కోసం కంపెనీ మూడు దశల్లో 500 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు అమలు చేస్తోంది. ఇందులో ఇప్పటికే 200 ఎకరాల్లో తొలి దశను పూర్తి చేసింది. ఈ కొత్త ప్రాజెక్టు కోసం కంపెనీ రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.

Updated Date - Jan 03 , 2025 | 05:17 AM