Private Sector Executives to Lead: ఇక ప్రైవేట్ రంగం నుంచి పీఎస్‌బీ సారథులు
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:40 AM
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సహా ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల అత్యున్నత శ్రేణి మేనేజ్‌మెంట్ హోదాల్లో ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను...
ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సహా ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల అత్యున్నత శ్రేణి మేనేజ్‌మెంట్ హోదాల్లో ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను నియమించుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎస్‌బీఐలోని నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒక పోస్టును ప్రైవేట్ రంగానికి కేటాయించారు. ఇప్పటివరకు పీఎ్‌సబీల ఎండీ, చైర్మన్ పదవులన్నింటికీ అంతర్గతంగా ఉన్న అర్హులైన అభ్యర్థులనే నియమిస్తూ వచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎస్‌బీఐ సహా 11 పీఎ్‌సబీలున్నాయి. సవరించిన నియామక మార్గదర్శకాల ప్రకారం ఇక నుంచి ఈ పదవులకు పోటీ చేసేందుకు ప్రైవేట్ రంగంలోని అభ్యర్థులను అనుమతించనున్నారు. ఇందుకు పోటీ పడాలనుకుంటున్న ప్రైవేట్ రంగ అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అందులో 15 సంవత్సరాలు బ్యాంకింగ్ అనుభవం, రెండేళ్లు బోర్డు స్థాయి అనుభవం అయి ఉండాలి. ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చిన తర్వాత అందుబాటులో ఉన్న తొలి వేకెన్సీ ఎస్‌బీఐ ఎండీ. దీన్ని ప్రైవేటు రంగం నుంచి భర్తీ చేసిన అనంతరం ఏర్పడే ఖాళీలన్నింటినీ పీఎ్‌సబీల్లోని అర్హులైన వారితోనే భర్తీ చేస్తారు. ఇక జాతీయ బ్యాంకుల ఈడీల విషయానికి వస్తే ఒక్కో పదవిని ప్రైవేటు రంగ అభ్యర్థులు సహా ఇతర రంగాల్లోని అర్హులకు కేటాయిస్తారు. ప్రస్తుతం పెద్ద జాతీయ బ్యాంకుల్లో నాలుగు ఈడీ పోస్టులు ఖాళీగా ఉండగా రెండు పోస్టులు చిన్న పీఎ్‌సబీల్లో ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..