Share News

పోకర్ణ లాభంలో 280 శాతం వృద్ధి

ABN , Publish Date - May 30 , 2025 | 04:01 AM

మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో పోకర్ణ లిమిటెడ్‌ కన్సాలిడేటెడ్‌ ప్రాతిదికన రూ.262.67 కోట్ల ఆదాయంపై రూ.58.90 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం...

పోకర్ణ లాభంలో 280 శాతం వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో పోకర్ణ లిమిటెడ్‌ కన్సాలిడేటెడ్‌ ప్రాతిదికన రూ.262.67 కోట్ల ఆదాయంపై రూ.58.90 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.15.51 కోట్లు)తో లాభం ఏకంగా 279.77 శాతం వృద్ధి చెందగా ఆదాయం 62.50 శాతం పెరిగింది. మార్చితో ముగిసిన మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను రూ.930.13 కోట్ల మొత్తం రెవెన్యూపై రూ.187.54 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనుబంధ సంస్థ పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ సామర్థ్యాలను విస్తరించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం నుంచి ఈ విభాగం నుంచి మంచి ఆదాయాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పోకర్ణ లిమిటెడ్‌ సీఎండీ గౌతమ్‌ చంద్‌ జైన్‌ తెలిపారు. అలాగే హైదరాబాద్‌, మేకగూడ ప్లాంట్‌లో మెషినరీ ఏర్పాటు డిసెంబరు నాటికి పూర్తి కావచ్చని కంపెనీ పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ఇది కార్యకలాపాలు ప్రారంభించనుందని తెలిపింది.

ఇవీ చదవండి:

భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 04:01 AM