Share News

Piramal Finance: తెలుగు రాష్ట్రాల్లో రూ.7,657 కోట్ల రుణాలు

ABN , Publish Date - Aug 09 , 2025 | 03:20 AM

పిరామల్‌ ఫైనాన్స్‌ తెలుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో

Piramal Finance: తెలుగు రాష్ట్రాల్లో రూ.7,657 కోట్ల రుణాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : పిరామల్‌ ఫైనాన్స్‌ తెలుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో 55 శాఖల ద్వారా వివిధ వర్గాలకు రూ.7,657 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేసినట్టు కంపెనీ మార్కెటింగ్‌ హెడ్‌ అరవింద అయ్యర్‌ తెలిపారు. ఇందులో తెలంగాణ వాటానే రూ.5,000 కోట్ల నుంచి రూ.5,200 కోట్ల వరకు ఉందన్నారు. ఇది తమ మొత్తం రుణ పోర్టుఫోలియోలో పదిశాతమని తెలిపారు. ఎంఎ్‌సఎంఈలతో పాటు వ్యక్తిగత, గృహ రుణాలు, ఆస్తులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల హామీపై తమ కంపెనీ రిటైల్‌ రుణాలు ఇస్తుందన్నారు. ఆదాయానికి సంబంధించి సరైన ధ్రువ పత్రాలు లేని వ్యక్తులకూ, కొన్ని షరతులకు లోబడి తాము రుణాలిస్తామని అయ్యర్‌ చెప్పారు. తామిచ్చే గృహ రుణాలపై వడ్డీ 9.9 శాతం నుంచి 14 శాతం వరకు ఉంటుందన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 03:20 AM