One97 Communications: తొలిసారిగా లాభాల్లోకి పేటీఎం
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:39 AM
పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తొలిసారిగా లాభాల్లోకి అడుగు పెట్టింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.122.50 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ప్రకటించింది...
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తొలిసారిగా లాభాల్లోకి అడుగు పెట్టింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.122.50 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ప్రకటించింది. వ్యయాలను గణనీయంగా నియంత్రించడంతో పాటు పేమెంట్ ఆదాయాలు పెరగడం ఇందుకు దోహదపడినట్టు కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.840 కోట్ల నికర నష్టం ప్రకటించింది. స్థూల లాభం సైతం రూ.72 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే కంపెనీ మార్కెటింగ్, ప్రచార వ్యయాలను సగానికి సగం తగ్గించుకుంది. జూన్ త్రైమాసికంలో పేమెంట్ ప్రాసెసింగ్ మార్జిన్లు పెరిగిన కారణంగా కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,917.50 కోట్లకు పెరిగింది.
ఇవీ చదవండి:
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి