Share News

Oppo Reno 13 Series : మార్కెట్లోకి ఒప్పో రెనో 13

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:15 AM

ఒప్పో ఇండియా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలోకి ఒప్పో రెనో 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను తీసుకువచ్చింది. ఒప్పో ఇండియా ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ అసీమ్‌ మాథుర్‌ ఈ ఫోన్లను విడుదల

Oppo Reno 13 Series : మార్కెట్లోకి ఒప్పో రెనో 13

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఒప్పో ఇండియా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలోకి ఒప్పో రెనో 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను తీసుకువచ్చింది. ఒప్పో ఇండియా ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ అసీమ్‌ మాథుర్‌ ఈ ఫోన్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరికొత్త మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌, ఏఐ రెడీ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. అండర్‌ వాటర్‌ ఫొటోగ్రఫీ, ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ.. ఈ ఫోన్‌ ప్రత్యేకత అని తెలిపారు. రెండు వేరియంట్లలో రెనో 13 ప్రో 5జీ, రెనో 13 5జీతో ఈ ఫోన్‌ అందుబాటులో ఉండనుంది. ఇందులో రెనో 13 5జీ ఆఫర్లతో కలుపుకుని 8జీబీ+128 జీబీ (రూ.34,199), 8జీబీ+256 జీబీ (రూ.35,999)తో అందుబాటులో ఉండగా రెనో 13 ప్రో 5జీ.. 12 జీబీ+256 జీబీ (రూ.44,999), 12 జీబీ+512 జీబీ (రూ.49,499)తో అందుబాటులో ఉంటాయి.


Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..

Also Read-IT Raids on Tollywood: ఐటీ నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందేనా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2025 | 05:22 AM