ఎన్‌విడియా మళ్లీ ప్రపంచ నం.1
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:19 AM
అమెరికాకు చెందిన ఏఐ చిప్‌ల తయా రీ దిగ్గజం ఎన్‌విడియా.. మైక్రోసా్‌ఫ్టను వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది...
అమెరికాకు చెందిన ఏఐ చిప్‌ల తయా రీ దిగ్గజం ఎన్‌విడియా.. మైక్రోసా్‌ఫ్టను వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మంగళవారం అమెరికా మార్కెట్లో ఎన్‌విడియా మార్కెట్ విలువ 3.45 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.44 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఎన్‌విడియా అగ్రస్థానానికి చేరడం ఈ జనవరి 24న తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. గడిచిన నెలరోజుల్లో కంపెనీ షేరు 24 శాతం వృద్ధి చెందడం ఇందుకు దోహదపడింది.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి