Share News

న్యూమరస్‌ మోటార్స్‌ డిప్లాస్‌ మ్యాక్స్‌ ఈవీ

ABN , Publish Date - Feb 28 , 2025 | 02:17 AM

బెంగళూరు కేంద్రంగా ఉన్న న్యూమరస్‌ మోటార్స్‌.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లోకి మల్టీయుటిలిటీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిప్లాస్‌ మ్యాక్స్‌ విడుదల...

న్యూమరస్‌ మోటార్స్‌ డిప్లాస్‌ మ్యాక్స్‌  ఈవీ

ధర రూ.1,12,199

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బెంగళూరు కేంద్రంగా ఉన్న న్యూమరస్‌ మోటార్స్‌.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లోకి మల్టీయుటిలిటీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిప్లాస్‌ మ్యాక్స్‌ విడుదల చేసింది. ఈ స్కూటర్‌ ధర రూ.1,12,199. అన్ని రకాలైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రూపొందించినట్లు సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇంజనీరింగ్‌) సుందరరాజన్‌ ఎస్‌ వెల్లడించారు. రెండు బ్యాటరీలు, డ్యూయల్‌ డిస్క్‌ బ్రేక్స్‌, థెఫ్ట్‌ అలర్ట్స్‌, జియోఫెన్సింగ్‌, వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో డిప్లాస్‌ మ్యాక్స్‌ను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. న్యూమరస్‌ మోటార్స్‌ ప్రస్తుతం 30 ఔట్‌లెట్స్‌ను నిర్వహిస్తోందని, త్వరలో ఈ సంఖ్యను 45కు చేర్చనున్నట్లు చెప్పారు.


For Business News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 02:17 AM