Share News

ఎన్‌ఎస్‌ఈతో వి హబ్‌ ఎంఓయూ

ABN , Publish Date - May 29 , 2025 | 02:16 AM

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో (ఎన్‌ఎస్‌ఈ) తెలంగాణకు చెందిన వి హబ్‌ ఫౌండేషన్‌ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి...

ఎన్‌ఎస్‌ఈతో వి హబ్‌ ఎంఓయూ

హైదరాబాద్‌: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో (ఎన్‌ఎస్‌ఈ) తెలంగాణకు చెందిన వి హబ్‌ ఫౌండేషన్‌ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్క సమక్షంలో ఇరువర్గాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎన్‌ఎ్‌సఈ, వి హబ్‌ ఫౌండేషన్‌ కలిసి రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాల(ఐఏపీ) ద్వారా ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం, ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ, ఎన్‌ఎ్‌సఈలోని ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ‘ఎమర్జ్‌’లో షేర్లను నమోదుపై మహిళా ఆంత్రప్రెన్యూర్ల నిర్వహణలోని ఎంఎ్‌సఎంఈల్లో అవగాహన పెంచడం, విద్యార్థులకు బీఎ్‌ఫఎ్‌సఐ రంగంలో సమగ్ర శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 03:08 PM