ఎన్‌ఎస్‌ఈ, వి హబ్ ఫౌండేషన్ కీలక ఒప్పందం: ఆర్థిక అక్షరాస్యత, మహిళా సాధికారతే లక్ష్యం

ABN , First Publish Date - 2025-05-28T22:39:46+05:30 IST

ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం అయిన వి హబ్ ఫౌండేషన్ (విమెన్ ఆంత్రప్రెన్యూర్స్ హబ్ ఫౌండేషన్) మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది.

ఎన్‌ఎస్‌ఈ, వి హబ్ ఫౌండేషన్ కీలక ఒప్పందం: ఆర్థిక అక్షరాస్యత, మహిళా సాధికారతే లక్ష్యం

హైదరాబాద్, మే 28, 2025: ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం అయిన వి హబ్ ఫౌండేషన్ (విమెన్ ఆంత్రప్రెన్యూర్స్ హబ్ ఫౌండేషన్) మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో ఆర్థిక పరిజ్ఞానం పెంచడం, మహిళా వ్యవస్థాపకులకు చేయూత ఇవ్వడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) నిధుల సేకరణ సులభతరం చేయడం, అలాగే విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యాలుగా పెట్టుకున్నారు.


ఒప్పందం గురించి వివరంగా..

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో హైదరాబాద్‌లో ఈ ఒప్పందం జరిగింది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్, వి హబ్ ఫౌండేషన్ సీఈఓ సీతా పల్లచోళ్ల దీనిపై సంతకాలు చేశారు.


ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఎన్‌ఎస్‌ఈ, వి హబ్ ఫౌండేషన్‌తో కలిసి ఆర్థిక అక్షరాస్యతను, పెట్టుబడిదారుల అవగాహనను పెంచడానికి సెమినార్లు, వర్క్‌షాప్‌లు, రోడ్ షోలు వంటి కార్యక్రమాలు నిర్వహించనుంది. ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మహిళల నేతృత్వంలోని ఎంఎస్‌ఎంఈలకు ఐపీఓ (IPO) విధానం ద్వారా నిధుల సమీకరణకు మార్గనిర్దేశం చేయనున్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ (BFSI) రంగంలో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతో మహిళలకు శిక్షణ ఇచ్చి, వారి ఉపాధి అవకాశాలను పెంచడం కూడా ఈ ఒప్పందంలో ఒక ముఖ్య భాగం.

Updated Date - 2025-05-28T22:39:47+05:30 IST