ఎన్ఎస్ డీఎల్ లాభం రూ 83 కోట్లు
ABN , Publish Date - May 26 , 2025 | 05:33 AM
త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సడీఎల్) ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.83.3 కోట్ల...
న్యూఢిల్లీ: త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సడీఎల్) ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.83.3 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదు చేసిన రూ.79.5 కోట్లతో పోలిస్తే ఇది 4.77 శాతం ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 9.94 శాతం పెరిగి రూ.394 కోట్లకు చేరింది.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి