Share News

ఇనుప ఖనిజం ఉత్పత్తిలో 22 శాతం వృద్ధి లక్ష్యం ఎన్‌ఎండీసీ

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:51 AM

ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ ఈ ఏడాది ఇనుప ఖనిజం ఉత్పత్తిని 22ు మేరకు పెంచి 5.5 కోట్ల టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది...

ఇనుప ఖనిజం ఉత్పత్తిలో 22 శాతం వృద్ధి లక్ష్యం ఎన్‌ఎండీసీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ ఈ ఏడాది ఇనుప ఖనిజం ఉత్పత్తిని 22ు మేరకు పెంచి 5.5 కోట్ల టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 10 కోట్ల టన్నులకు ఉత్పత్తిని విస్తరించాలన్న బృహత్‌ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4.5 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. ఏప్రిల్‌, మే నెలల్లో 45ు వృద్ధితో 84.3 లక్షల టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసినట్టు తెలిపింది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 04:51 AM