Share News

కీలక ఖనిజాలపై ఎన్‌ఎండీసీ దృష్టి

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:55 AM

ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ విదేశాల్లో కీలక ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో...

కీలక ఖనిజాలపై ఎన్‌ఎండీసీ దృష్టి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ విదేశాల్లో కీలక ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో ఇప్పటికే ఈ ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం కంపెనీ ఇప్పటికే దుబాయ్‌లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయం ద్వారా ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లోని కీలక ఖనిజ ఉత్పత్తి కంపెనీలపై దృష్టి పెడుతుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో కోకింగ్‌ కోల్‌, చిలీ, ఆఫ్రికా దేశాల్లో లిథియం, ఇనుప ఖనిజం, రాగి, కోబాల్ట్‌ గనుల కోసం ఎన్‌ఎండీసీ అన్వేషిస్తోంది.

ధరల తగ్గింపు: టన్ను ఇనుప ఖనిజం (లంప్‌) ధరను రూ.6,300 నుంచి రూ.5,700కు, ఫైన్స్‌ క్వాలిటీ ఖనిజం ధరను రూ.5,350 నుంచి రూ.4,850కి తగ్గించినట్టు ఎన్‌ఎండీసీ ప్రకటించింది. ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.

ఇవీ చదవండి:

మీ వ్యక్తిగత రుణాన్ని ఈ 5 మార్గాలతో ఈజీగా తీర్చుకోండి

వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. డేంజర్ జాగ్రత్త..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 04:55 AM