టెక్ వ్యూ 24500 వద్ద నిలదొక్కుకోవడం కీలకం
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:33 AM
నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమై మానసిక అవధి 25,000 కన్నా పైకి దూసుకుపోయినా ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఇది స్వల్పకాలిక బలహీనతను సూచిస్తోంది. అయితే శుక్రవారం...
టెక్ వ్యూ : 24,500 వద్ద నిలదొక్కుకోవడం కీలకం
నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమై మానసిక అవధి 25,000 కన్నా పైకి దూసుకుపోయినా ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఇది స్వల్పకాలిక బలహీనతను సూచిస్తోంది. అయితే శుక్రవారం నాడు 250 పాయింట్లు లాభపడడం ద్వారా 24,500 వద్ద మద్దతు లభించినట్టు కూడా నిర్ధారించింది. గత ఐదు వారాలుగా సైడ్‌వేస్, కన్సాలిడేషన్ ట్రెండ్‌లో ఉన్న మార్కెట్ 25,000-24,500 మధ్యన కదలాడుతోంది. అలాగే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా కీలక స్థాయిలు 60,000, 19,000 వరకు వెళ్లినా ఆ స్థాయిల్లో నిలదొక్కుకోలేకపోయాయి. మొత్తం మీద మార్కెట్ ఐదు వారాల కనిష్ఠ స్థాయిలో ముగియడం, శుక్రవారం అమెరికన్ మార్కెట్లు బలహీనత ప్రదర్శించిన నేపథ్యంలో ఈ వారం మార్కెట్ మద్దతు స్థాయిల్లో పరీక్ష ఎదుర్కొనవచ్చు. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
బుల్లిష్ స్థాయిలు: రికవరీ బాట పట్టినట్టయితే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ను మరింతగా కొనసాగించేందుకు కీలక నిరోధం 25,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. అయితే కొన్ని వారాలుగా మార్కెట్ తీవ్ర ఆటుపోట్లలో ఉన్నందు వల్ల సానుకూలత కోసం మొదట కనిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేట్ కావడం తప్పనిసరి.
బేరిష్ స్థాయిలు: గత వారం నిఫ్టీ 24,500 వద్ద మైనర్ రికవరీ సాధించింది. భద్రత కోసం ఈ స్థాయిలో నిలదొక్కుకుని తీరాలి. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుందనేందుకు సంకేతంగా భావించాలి. ప్రధాన మద్దతు స్థాయి 23,900.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 57,000 వరకు వెళ్లి బలమైన కరెక్షన్‌లో పడడంతో పాటు 1,050 పాయింట్ల నష్టంతో 55,525 వద్ద ముగిసింది. గతంలో ఏర్పడిన టాప్ కన్నా దిగువన క్లోజ్ కావడం స్వల్పకాలిక అప్రమత్త సంకేతం. మద్దతు స్థాయి 55,000. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ముప్పు ఎదుర్కొంటుంది. రికవరీ బాట పడితే మరింత సానుకూలత కోసం నిరోధ స్థాయి 56,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి.
పాటర్న్: 24,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. ఇదే స్థాయిలో ట్రిపుల్ బాటమ్ కూడా ఏర్పడింది. అందువల్ల ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి. మార్కెట్ గత వారం 25 డిఎంఏ కన్నా దిగజారింది. ఇప్పుడు 50 డిఎంఏకు చేరువవుతోంది.
టైమ్ : ఈ సూచీ ప్రకారం గురువారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,780, 24,850
మద్దతు : 24,600, 24,500
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి