Nifty Rises: మళ్లీ 25500 ఎగువకు నిఫ్టీ
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:52 AM
స్టాక్ మార్కెట్లో మంగళవారం ఆరంభం నుంచి ట్రేడింగ్ స్తబ్దుగా సాగినప్పటికీ, ఆఖరి అరగంటలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఎంపిక చేసిన ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెంచారు. దాంతో...
ముంబై: స్టాక్ మార్కెట్లో మంగళవారం ఆరంభం నుంచి ట్రేడింగ్ స్తబ్దుగా సాగినప్పటికీ, ఆఖరి అరగంటలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఎంపిక చేసిన ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెంచారు. దాంతో ప్రామాణిక సూచీలు మోస్తరు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 270.01 పాయింట్ల వృద్ధితో 83,712.51 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61.20 పాయింట్లు బలపడి 25,522.50 వద్ద క్లోజైంది. అమెరికా సుంకాల అమలును ఈ నెల 9 నుంచి ఆగస్టు 1కి వాయిదా వేసింది. అయితే, మదుపరులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై స్పష్టమైన పురోగతి కోసం వేచి చూస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి