Share News

Nifty Sensex: 26000 చేరువలో నిఫ్టీ

ABN , Publish Date - Nov 13 , 2025 | 06:27 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒకదశలో 780.69 పాయింట్ల వరకు ఎగబాకి 84,652.01 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 595.19 పాయింట్ల లాభంతో...

Nifty Sensex: 26000 చేరువలో నిఫ్టీ

రూ.4 లక్షల కోట్లకు పైగా సంపద వృద్ధి

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒకదశలో 780.69 పాయింట్ల వరకు ఎగబాకి 84,652.01 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 595.19 పాయింట్ల లాభంతో 84,466.51 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 239.6 పాయింట్ల వరకు పెరిగి 25,934.55కు చేరినప్పటికీ, మళ్లీ కాస్త తగ్గి 180.85 పాయింట్ల లాభంతో 25,875.80 వద్ద ముగిసింది. దీంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.473.69 లక్షల కోట్లకు (5.34 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో దేశీయంగానూ మదుపరులు ఐటీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరపడం ఇందుకు దోహదపడింది. బిహార్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందవచ్చన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయని వారన్నారు. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 22 లాభపడగా.. ఏషియన్‌ పెయింట్స్‌ షేరు 4.46 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) రూ.1,750.03 కోట్ల నికర అమ్మకాలు జరుపగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ.5,127.12 కోట్ల కొనుగోళ్లు జరిపారు.

ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసల నష్టంతో రూ.88.62 వద్ద ముగిసింది.

ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.2,000 పెరిగి రూ.1,27,900కు చేరగా.. కిలో వెండి రూ.5,540 ఎగబాకి రూ.1,61,300 ధర పలికింది.

ఇవీ చదవండి:

మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..


మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..

Updated Date - Nov 13 , 2025 | 06:27 AM