Nifty Technical Analysis: టెక్ వ్యూ 25000 వద్ద పునరుజ్జీవం తప్పనిసరి
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:56 AM
నిఫ్టీ గత వారం కీలక స్థాయి 25,000 వద్ద రికవరీ తో ప్రారంభమైనా 25,250 వద్ద విఫలమై చివరి రెండు రోజుల్లో బలమైన రియాక్షన్‌లోకి జారుకుంది. చివరికి వారం మొత్తానికి 130 పాయింట్ల నష్టంతో 24,830 వద్ద ముగిసింది. గత కొద్ది రోజులుగా 25,000 స్థాయిలో...
నిఫ్టీ గత వారం కీలక స్థాయి 25,000 వద్ద రికవరీ తో ప్రారంభమైనా 25,250 వద్ద విఫలమై చివరి రెండు రోజుల్లో బలమైన రియాక్షన్‌లోకి జారుకుంది. చివరికి వారం మొత్తానికి 130 పాయింట్ల నష్టంతో 24,830 వద్ద ముగిసింది. గత కొద్ది రోజులుగా 25,000 స్థాయిలో ఏర్పడిన కన్సాలిడేషన్‌లో విఫలమైంది. అలాగే మిడ్‌క్యాప్-100, స్మాల్‌క్యాప్-100 సూచీలు కూడా బలమైన కరెక్షన్ సాధించాయి. ఇది స్వల్పకాలిక బలహీనతను సూచిస్తోంది. నిఫ్టీ గత నాలుగు వారాలుగా నిరంతర కరెక్షన్ ట్రెండ్‌లో ట్రేడవుతూ 850 పాయింట్ల మేరకు నష్టపోయింది. ప్రస్తుతం 25,000 కన్నా దిగువకు వచ్చినందువల్ల స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగవచ్చు.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీకి ఇంతకాలం మద్దతు స్థాయిగా ఉన్న 25,000 ఇప్పుడు నిరోధ స్థాయిగా మారింది. మరింత పాజిటివ్ ట్రెండ్ కోసం ఈ స్థాయిలో పునరుజ్జీవం సాధించి తీరాలి.
బేరిష్ స్థాయిలు: మరింత బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం మద్దతు స్థాయి 24,700 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే మరింత బలహీనతలో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 24,450.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ సైతం గత కొద్ది వారాలుగా 57,000 వద్ద సాగిన కన్సాలిడేషన్ అనంతరం విఫలమై వారం కనిష్ఠ స్థాయి 56,520 వద్ద ముగిసింది. మరింత అప్‌ట్రెండ్ కోసం 57,000 వద్ద నిలదొక్కుకుని తీరాలి. ప్రధాన నిరోధం, జీవితకాల గరిష్ఠ స్థాయి 57,600. బలహీనత ప్రదర్శించినా సానుకూలత కోసం 56,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది.
పాటర్న్: నిఫ్టీ గత వారం 50 డిఎంఏ కన్నా దిగువకు వచ్చింది. సానుకూలత కోసం 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద బౌన్స్‌బ్యాక్ కావాలి. అలాగే 24,700 వద్ద ఏర్పడిన ‘‘డబుల్ బాటమ్’’ పాటర్న్ వద్ద నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,940, 25,000
మద్దతు : 24,760, 24,700
వి. సుందర్ రాజా
ఇవీ చదవండి:
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..