ఈ వారం మరింత ముందుకే
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:51 AM
గత వారం నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 25,000 పాయింట్లను అధిగమించడం శుభ పరిణామం. దీంతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ మరింత మెరుగ్గా రాణించే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌బీఐ రెపో రేటు, సీఆర్‌ఆర్ రేట్లు తగ్గించడం...
గత వారం నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 25,000 పాయింట్లను అధిగమించడం శుభ పరిణామం. దీంతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ మరింత మెరుగ్గా రాణించే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌బీఐ రెపో రేటు, సీఆర్‌ఆర్ రేట్లు తగ్గించడం, వర్షపాతం మెరుగ్గా ఉంటుందన్న అంచనాలు, దిగొస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం వంటి సానుకూల అంశాలు సెంటిమెంట్‌ను మరింత పెంచుతున్నాయి. ఈ వారం డిఫెన్స్, రైల్వే, ఫైనాన్స్, బ్యాంకింగ్, డిపాజిటరీ సర్వీసెస్, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల షేర్లలో బుల్లి్‌షనెస్ కనిపిస్తోంది.
ఈ వారం స్టాక్ రికమండేషన్లు
ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంక్: రెండేళ్లుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ షేర్లలో ప్రస్తుతం మూమెంటం కనిపిస్తోంది. రిలెటివ్ స్ట్రెంత్ కూడా క్రమంగా పెరుగుతోంది. గత మూడు నెలల్లోనే ఈ షేర్లు 23 శాతం పెరిగాయి. కీలకమైన రూ.70 మార్క్‌ను దాటి గత వారం రూ.71.5 వద్ద ముగిశాయి. రూ.84/90 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.68/70 శ్రేణిలో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.65ను గట్ట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
జిందాల్ స్టెయిన్‌లె్‌స: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కంపెనీ షేర్లు ప్రస్తుతం అప్‌ట్రెండ్‌లోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలల్లోనే ఈ కంపెనీ షేర్లు దాదాపు 35 శాతం లాభపడ్డాయి. కీలకమైన రూ.650 వద్ద కన్సాలిడేట్ అయ్యాక పుంజుకున్నాయి. గత వారం 3.2 శాతం లాభంతో రూ.694 వద్ద ముగిశాయి. మదుపరులు రూ.820 టార్గెట్‌తో రూ.680 వద్ద ఈ కౌంటర్లో ప్రవేశించవచ్చు. రూ.660 స్టాప్‌లా్‌సని కచ్చితంగా పాటించాలి.
బజాజ్ ఫైనాన్స్: అప్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కంపెనీ షేర్లలో షార్ట్, మీడియం టర్మ్ మూమెంటం పెరుగుతోంది. గత శుక్రవారం 4.9 శాతం లాభంతో రూ.9,372 వద్ద్ద ముగిశాయి. రూ.9,900 టార్గెట్‌తో మదుపరులు రూ.9,300/9,200 శ్రేణిలో ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ రూ.9,150.
శ్రీరామ్ ఫైనాన్స్: ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు అత్యంత బలంగా ఉన్నాయి. గత వారం నెలవారీ గరిష్ఠ స్థాయిని బ్రేక్ చేసింది. పైగా వీసీపీ ప్యాటర్న్ ఫామ్ అవుతోంది. గత శుక్రవారం ఈ కంపెనీ షేర్లు 5.7 శాతం లాభంతో రూ.688 వద్ద ముగిశాయి. మదుపరులు రూ.740/820 టార్గెట్‌తో రూ.680/670 శ్రేణిలో పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.650ని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్: గత రెండేళ్లుగా ఈ కంపెనీ షేర్లు సైడ్‌వే్‌సలో కన్సాలిడేట్ అవుతున్నాయి. ఇపుడిపుడే మూమెంటం, రిలెటివ్ స్ట్రెంత్, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. కీలకమైన రూ.250 మద్ద తు స్థాయిని అధిగమించి గత శుక్రవారం ఐదు శాతం లాభంతో రూ.275 వద్ద ముగిశాయి. రూ.320/345 టార్గెట్‌తో మదుపరులు రూ.270 సమీపంలో ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.260ని స్టాప్‌లాస్ పాటించి తీరాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..