Share News

Bank Nifty support: 25000 వద్ద గట్టి పరీక్ష

ABN , Publish Date - Jul 21 , 2025 | 02:42 AM

నిఫ్టీ గత వారం ఆరంభంలో రికవరీ కనబరిచినా ఆ తర్వాత నిలదొక్కుకోలేక పోయింది. వారం మొత్తానికి 181 పాయిం ట్లు నష్టపోయి చివరకు 24,968 పాయింట్ల వద్ద క్లోజైంది. గత మూడు...

Bank Nifty support: 25000 వద్ద గట్టి పరీక్ష

నిఫ్టీ గత వారం ఆరంభంలో రికవరీ కనబరిచినా ఆ తర్వాత నిలదొక్కుకోలేక పోయింది. వారం మొత్తానికి 181 పాయిం ట్లు నష్టపోయి చివరకు 24,968 పాయింట్ల వద్ద క్లోజైంది. గత మూడు వారాలుగా నిఫ్టీ కరెక్షన్‌లోనే సాగుతూ దాదాపు 700 పాయింట్ల వరకు నష్టపోయింది. పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌తో నిఫ్టీ మరోసారి 25,000 దిగువకు చేరింది. అలాగే మిడ్‌క్యాప్‌-100, స్మాల్‌క్యాప్‌-100 సూచీలు కూడా గరిష్ఠ స్థాయి ల నుంచి రియాక్షన్‌ సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ 25,000 స్థాయిల వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొంటోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఒకటి, రెండు రోజుల్లో మార్కెట్‌ కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నిలదొక్కుకుంటేనే సానుకూల ట్రెండ్‌ను వెలువరిస్తుంది.

బుల్లిష్‌ స్థాయిలు: పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం తదుపరి నిరోధ స్థాయి 25,300 ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 25,550. ఇది స్వల్పకాలిక నిరోధ స్థాయి కావడంతో స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే తదుపరి మద్దతు స్థాయిలు 24,900 దిగువన ఉంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. తదుపరి మద్దతు స్థాయి 24,450.

బ్యాంక్‌ నిఫ్టీ: వీక్లీ ప్రాతిపదికన ఈ సూచీ గత వారం 470 పాయింట్ల మేర నష్టపోయి చివరకు 56,280 వద్ద క్లోజైంది. గడచిన మూడు వారాల్లో ఈ సూచీ దాదాపు 1,400 పాయింట్లు నష్టపోయింది. తదుపరి ప్రధాన నిరోధం 56,700. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 57,300. సూచీ మరింత బలహీనపడితే ప్రస్తుత మద్దతు స్థాయి 56,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఇది స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది.


పాటర్న్‌: నిఫ్టీ సానుకూలత కోసం 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ ఎగువన కచ్చితంగా బౌన్స్‌ బ్యాక్‌ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌ 25,000 సమీపంలో ఉన్న 50 డీఎంఏకు చేరువలో ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 25,060, 25,150

మద్దతు : 24,900, 24,830

వి. సుందర్‌ రాజా

ఇవీ చదవండి:

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 21 , 2025 | 02:42 AM