Share News

టెక్‌ వ్యూ మార్కెట్లో కన్సాలిడేషన్‌ ధోరణి

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:06 AM

నిఫ్టీ గత వారం మానసిక అవధి 25,000 స్థాయిలో మరోసారి విఫలమై అప్రమత్త ట్రెండ్‌ సంకేతం ఇచ్చింది. 100 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయికి చేరువలో 24,750 వద్ద ముగిసింది. గత మూడు వారాలుగా కూడా...

టెక్‌ వ్యూ మార్కెట్లో కన్సాలిడేషన్‌ ధోరణి

నిఫ్టీ గత వారం మానసిక అవధి 25,000 స్థాయిలో మరోసారి విఫలమై అప్రమత్త ట్రెండ్‌ సంకేతం ఇచ్చింది. 100 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయికి చేరువలో 24,750 వద్ద ముగిసింది. గత మూడు వారాలుగా కూడా 25,000 వద్ద పరీక్ష ఎదుర్కొంటూనే ఉంది. మే నెల చార్టుల ప్రకారం సైతం మార్కెట్లో అప్రమత్త ట్రెండ్‌ నెలకొని ఉంది. మిడ్‌క్యాప్‌-100 సూచీకి 58,000, స్మాల్‌క్యాప్‌-100 సూచీకి 18,000 వద్ద నిరోధం ఎదురవుతోంది. మార్కెట్‌ ప్రస్తుతం కీలక దశలో ఉంది. సానుకూలత కోసం నిఫ్టీ తప్పనిసరిగా బౌన్స్‌బ్యాక్‌ అయి 25,000 వద్ద బ్రేకౌట్‌ సాధించాలి. లేదంటే స్వల్పకాలిక కరెక్షన్‌ ముప్పు ఎదుర్కొంటుంది.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ ప్రస్తుతం 25,000-24,500 మధ్యన కదలాడుతోంది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం 24,900 తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. ఆ పైన నిరోధం 25,100. ఇదే మే 15న నమోదైన గరిష్ఠ స్థాయి.

బేరిష్‌ స్థాయిలు: మైనర్‌ మద్దతు స్థాయి 24,600 వద్ద విఫలమైతే మరింత బలహీనతను ప్రదర్శిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 24,450. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం నిలకడగా పాజిటివ్‌ ట్రెండ్‌ ప్రదర్శిస్తూ వచ్చిన ఈ సూచీ ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయి 56,100 చేరువలో ఉంది. ఇక్కడ కన్సాలిడేషన్‌ ఉండవచ్చు. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడు మాత్రమే మరింత కొత్త శిఖరాలకు పురోగమిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 55,000. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ముప్పు ఏర్పడుతుంది.


పాటర్న్‌: గత రెండు వారాల్లో 25,100 వద్ద డబుల్‌ టాప్‌ పాటర్న్‌ ఏర్పడింది. సానుకూలత కోసం దీన్ని ఛేదించాలి. అలాగే 24,450 వద్ద డబుల్‌ బాటమ్‌ పాటర్న్‌ కూడా ఏర్పడింది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,840, 24,900

మద్దతు : 24,660, 24,600

వి. సుందర్‌ రాజా


ఇవీ చదవండి:

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 03:06 AM