టెక్ వ్యూ 25000 స్థాయి కీలకం
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:47 AM
నిఫ్టీ గత వారం ప్రారంభంలో మరింత బలహీనత ప్రదర్శించినా శుక్రవారం బలమైన ర్యాలీ సాధించి చివరికి 25,000 సమీపంలో ముగిసింది. ముందు వారంతో పోల్చితే 250 పాయింట్ల వరకు లాభపడింది. గత,,,
టెక్ వ్యూ : 25,000 స్థాయి కీలకం
నిఫ్టీ గత వారం ప్రారంభంలో మరింత బలహీనత ప్రదర్శించినా శుక్రవారం బలమైన ర్యాలీ సాధించి చివరికి 25,000 సమీపంలో ముగిసింది. ముందు వారంతో పోల్చితే 250 పాయింట్ల వరకు లాభపడింది. గత నాలుగు వారాలుగా 24,500-25,000 స్థాయిలో సైడ్‌వేస్, కన్సాలిడేషన్ ధోరణిలో ట్రేడయిన అనంతరం గరిష్ఠ స్థాయిల్లో పటిష్ఠంగా ముగిసింది. మిడ్‌క్యాప్ సూచీ 1600 పాయింట్లు, స్మాల్‌క్యాప్ సూచీ 700 పాయింట్ల మేరకు బలమైన ర్యాలీ సాధించాయి. టెక్నికల్‌గా మార్కెట్ ప్రస్తుతం పాజిటివ్ ధోరణిలోనే ఉన్నప్పటికీ ఇటీవల సాధించిన గరిష్ఠ స్థాయి 25,150 కన్నా దిగువనే ఉంది. ఈ కారణంగా ఈ స్థాయిలో పరీక్ష ఎదుర్కొనవచ్చు.
బుల్లిష్ స్థాయిలు: ర్యాలీని మరింతగా కొనసాగించాలంటే నిఫ్టీ తప్పనిసరిగా 25,150 కన్నా పైన నిలదొక్కుకోవాలి. పైన ప్రధాన నిరోధ స్థాయిలు 25300, 25500.
బేరిష్ స్థాయిలు: 25000 వద్ద పరీక్షలో విఫలమై అంతకన్నా దిగజారితే అప్రమత్త సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 24,800. ఇక్కడ కూడా విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 24,500.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ బలమైన ర్యాలీ సాధించి 830 పాయింట్ల లాభంతో 56,580 వద్ద ముగిసింది. మానసిక అవధి 57,000. ఆ పైన మాత్రమే మరిం త అప్‌ట్రెండ్ ఉంటుంది. 56,000 వద్ద రియాక్షన్ ఏర్పడి అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతగా భావించి అప్రమత్తం కావాలి.
పాటర్న్: మార్కెట్ మూడో సారి 25,000 స్థాయిలో పరీక్షకు సమాయత్తం అవుతోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ మరింతగా కొనసాగాలంటే ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. 25,000 స్థాయిలోనే ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిరోధం ఎదురవుతోంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25,150, 25240
మద్దతు : 24,920, 24800
వి. సుందర్ రాజా
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..